- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Exports: బ్యాంకుల క్రెడిట్ తగ్గడంతో ఎగుమతి రంగంపై ప్రభావం
దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా భారత బ్యాంకింగ్ తగ్గిన డిపాజిట్ల కారణంగా వివిధ రంగాలపై ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఎగుమతుల రంగంపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎగుమతిదారులకు తగ్గుతున్న బ్యాంక్ క్రెడిట్ కారణంగా మొత్తం రంగం దెబ్బతీస్తున్నది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 11న ఎగుమతుల రంగానికి చెందిన వ్యాపారులు కేంద్ర వాణిజ, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. 2021-22 నుంచి 2023-24 మధ్య ఎగుమతులు 15 శాతం వృద్ధి చెందాయి. అయితే, 2022 మార్చి నుంచి 2024 మార్చి మధ్య ఎగుమతుల రంగానికి రుణాలు 5 శాతం తగ్గాయని ఎగుమతిదారులు తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఎగుమతులకు అనుగుణంగా ఎగుమతులకు రుణాల వృద్ధి రేటు పెరగడం లేదని అపెక్స్ ఎక్స్‌పోర్టర్స్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. 'సరకుల ధరల పెరుగుదల, సరకు రవాణా (సముద్రం, గాలి రెండూ), ఎర్ర సముద్ర సంక్షోభం కారణంగా ఎక్కువ కాలం పాటు అధిక క్రెడిట్ అవసరం ఉన్నప్పటికీ 2022 మార్చి నుంచి 2024 మార్చి మధ్య ఎగుమతులకు అందాల్సిన క్రెడిట్‌లో క్షీణత కనిపించింది' అని ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ చెప్పారు.