రాత్రి పెద్ద పార్టీ ఇచ్చి మరి ఉద్యోగులపై వేటు వేసిన కంపెనీ

by Harish |
రాత్రి పెద్ద పార్టీ ఇచ్చి మరి ఉద్యోగులపై వేటు వేసిన కంపెనీ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ బిషప్ ఫాక్స్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇటీవల తన ఉద్యోగులకు ఖరీదైన మద్యంతో పెద్ద పార్టీ ఇచ్చిన కంపెనీ సడన్‌గా 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పి వారిని షాకింగ్‌కు గురిచేసింది. లేఆఫ్ ప్రకటించే ముందు రోజు రాత్రి కంపెనీ ఇచ్చిన పార్టీలో ఉద్యోగులు బాగా ఎంజాయ్ చేశారు. కానీ తరువాత రోజు ఉదయం 50 మంది ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలియగానే అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నెల‌కొన్న ఆర్ధిక అనిశ్చితి ప‌రిస్ధితులు, ఖర్చుల నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీలో సుమారు 400 మంది పని చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story