Budget-2025: కార్పొరేట్‌లకు కాదు, ప్రజలపై పన్నులు తగ్గించాలి: మాజీ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

by S Gopi |
Budget-2025: కార్పొరేట్‌లకు కాదు, ప్రజలపై పన్నులు తగ్గించాలి: మాజీ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో రెండు రోజుల్లో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌లో కార్పొరేట్ వర్గాలకు పన్ను మినహాయింపు ఇవ్వడం కంటే సామాన్యుల వ్యక్తిగత ఆదాయపు పన్నులను తగ్గించడానికి ప్రధాన్యత ఇవ్వాలని మాజీ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్జిత్ భల్లా అభిప్రాయపడ్డారు. మంగళవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తొలిగా భారత ఎఫ్‌డీఐ విధానాన్ని మార్చాలని, తదుపరి వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలన్నారు. ప్రస్తుతం భారత్‌లో పన్నులు అధికంగా ఉన్నాయి. కానీ కార్పొరేట్ వర్గాలకు ప్రయోజనం కల్పించే పన్ను మినహాయింపుల కంటే ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత పన్నుల విధానాన్ని విమర్శించిన ఆయన.. దేశ పన్ను-జీడీపీ నిష్పత్తి 19 శాతంగా ఉంది. ఇది తూర్పు ఆసియా ప్రాంతంలో సగటున 14.5 శాతం కంటే అత్యధికం. మరే దేశంలోనూ లేని విధంగా భారత ప్రజలపై పన్నులు అమలవుతున్నాయి. అమెరికా, కొరియా దేశాల కంటే చాలా తక్కువ తలసరి ఆదాయం భారత్‌లో పన్ను-జీడీపీ నిష్పత్తి ఎందుకు ఎక్కువగా ఉందని ఆయన ప్రశ్నించారు.

వ్యక్తిగత ఆదాయపు పన్నులను తగ్గించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. తాను 2019లో కార్పొరేట్ పన్నుల తగ్గింప సమయంలో పనిచేశాను. అప్పుడు ఆ నిర్ణయాలు విజయవంతమయ్యాయి. దాని ప్రయోజనాలు సమకూరాయి. కానీ ఇప్పుడు కార్పొరేట్ పన్ను తగ్గింపు అక్కరలేదు. వ్యక్తిగత ఆదాయపు పన్నులను తగ్గించాలి. పన్ను రేట్లను తగ్గించినట్లయితే ప్రభుత్వ ఆదాయం మెరుగుపడుతుంది. తద్వారా మరిన్ని మౌలిక సదుపాయాలకు నిధులను సమకూర్చుకోవచ్చు. మరిన్ని సంక్షేమ పథకాలకు నిధులు అందించవచ్చు. పన్నులు పెంచడం వల్ల ఇది సాధ్యమవదని భల్లా తెలిపారు. వినియోగాన్ని పెంచేందుకు, ఆర్థిక వృద్ధిని నడిపేందుకు ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed