- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలా చేస్తే ఆడపిల్లల చదువులు, పెళ్లికి రూ. 63 లక్షలకు పైగా పొందొచ్చు!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పటికి ఆడపిల్లల చదువులు, వారి అభివృద్ధి పట్ల చిన్న చూపు ఉంది. అయితే దీన్ని రూపుమాపి ఆడపిల్లల అభివృద్ధికి సహాయంగా ఉండటానికి, వారి కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరడం ద్వారా ఆడపిల్లల చదువులు, పెళ్లిలకు వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక చింత లేకుండా ఉండవచ్చు.
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో కూడా, కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎక్కువగా చేరడం లేదు. స్కీమ్‌ల గురించి సరైన అవగాహన లేకపోవడం వలన వారు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లల గురించి తీసుకొచ్చిన చిన్న మొత్తాల పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన గురించి కొంత మందికి సరైన అవగాహన లేకపోవడం వలన ఈ పథకంలో ఉండే ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
సుకన్య సమృద్ధి యోజన పథకం పూర్తి వివరాలు ఒకసారి చూడండి..
* ఈ పథకాన్ని పోస్ట్‌ఆఫీస్ కార్యాలయాల్లో ఓపెన్ చేయవచ్చు.
* అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని పదేళ్ల వయసున్న ఆడపిల్లల తల్లిదండ్రులు అర్హులు.
* ఒక బాలికపై ఒక్క ఖాతా మాత్రమే తెరిచే అవకాశం ఉంది.
* రూ. 250 చెల్లించి ఖాతాను తీసుకోవాల్సి ఉంటుంది.
* ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు.
* ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14 ఏళ్లు, గరిష్ఠం 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు.
* ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వార్షిక వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీరేటును ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది.
ఉదాహరణ: ఈ పథకంలో ప్రతి ఏడాది రూ.10,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 1,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 2,74,344 వడ్డీ కలిపి మొత్తం రూ. 4,24,344 లాభం వస్తుంది. అదే ఏడాదికి రూ. 1,00,000 జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 15,00,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 27,43,436 వడ్డీ కలిపి మొత్తం రూ. 42,43,436 లాభం పొందవచ్చు. ఒక వేళ రూ. 1,50,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ. 22,50,000 అవుతుంది. తరువాత మెచ్యూరిటీ సమయంలో రూ. 41 లక్షలకు పైగా వడ్డీతో కలిపి మొత్తం రూ. 63 లక్షలకు పైగా చేతికి వస్తాయి.
Read more :