Colgate: కోల్గేట్‌కు రూ. 249 కోట్ల పన్ను నోటీసులు

by S Gopi |
Colgate: కోల్గేట్‌కు రూ. 249 కోట్ల పన్ను నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ కోల్గేట్-పామోలివ్(ఇండియా)కు ఆదాయపు పన్ను విభాగం నోటీసులు జారీ చేసింది. ధరలకు సంబంధించిన అంశంలో జరిగిన అవకతవకలపై రూ. 248.74 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను కంపెనీ అందుకుంది. అయితే, దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాలు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. 2021, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోల్గేట్ ధరల బదిలీ సంబంధిత విషయంలో పన్ను నోటీసులు ఇచ్చినట్టు ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ధరల బదిలీ అనేది కంపెనీ ఒక ఉత్పత్తి ధరను వివిధ దేశాల్లోని ఉత్పత్తులకు బదిలీ చేయడం. ఈ విషయంలో సమస్య ఉత్పన్నమైందని, అందుగ్గానూ రూ. 248.74 కోట్ల విలువైన పన్ను చెల్లించాలని, ఈ మొత్తం రూ. 79.63 కోట్ల వడ్డీతో కలిపి ఆదాయపు పన్ను విభాగం నోటీసులు ఇచ్చినట్టు కోల్గేట్ కంపెనీ తన ప్రకటనలో వివరించింది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోల్గేట్ కంపెనీ రూ. 5,644 కోట్ల విలువైన విక్రయాలను నమోదు చేసింది.

Advertisement

Next Story