- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారం మొదలు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నుంచే బలహీనంగా మొదలైన సూచీలు సాయంత్రం వరకు అదే ధోరణిలో ర్యాలీ చేశాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ప్రధానంగా వరుసగా పతనమవుతున్న అదానీ కంపెనీల షేర్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అమెరికా జాబ్ డాటా కారణంగా ఫెడ్ నిర్ణయాలపై ప్రభావం ఉండొచ్చనే అంచనాలతో నీరసించాయి. దీనికితోడు భారత మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవడంతో నష్టాలు ఎదురయ్యాయి.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 334.98 పాయింట్లు పతనమై 60,506 వద్ద, నిఫ్టీ 89.45 పాయింట్లు క్షీణించి 17,764 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాలు రాణించగా, మెటల్ 2 శాతానికి పైగా కుదేలైంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, అల్ట్రా సిమెంట్, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.72 వద్ద ఉంది.