ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన 'సిటీ యూనియన్ బ్యాంక్'

by Harish |   ( Updated:2022-09-03 04:03:14.0  )
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన సిటీ యూనియన్ బ్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ సంస్థ 'సిటీ యూనియన్ బ్యాంక్' రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ పెంచింది. సాధారణ ప్రజలకు 4.00% నుంచి 6.00%. సీనియర్ సిటిజన్‌లకు 4.00% నుండి 6.25% అందించనుంది.

7 నుంచి 14 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.00% వడ్డీ రేటు, 15-45 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న టర్మ్ డిపాజిట్లపై 4.10% వడ్డీ రేటును అందిస్తోంది. 46-90 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.15% వడ్డీ రేటు లభిస్తుంది.

91-180 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న టర్మ్ డిపాజిట్లపై 4.25% వడ్డీ, 181 - 270 రోజుల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.50% వడ్డీ లభిస్తుంది. 271- 364 రోజుల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.00% వడ్డీ రేటు, 365 - 399 రోజుల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50% వడ్డీ రేటు, 400 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.60% వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది.

401 - 699 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50% వడ్డీ రేటు, 700 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75% వడ్డీ రేటు లభిస్తుంది. 701 రోజుల నుంచి 10 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50%, 5 సంవత్సరాల మెచ్యూరిటీ కాలవ్యవధితో పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.00% వడ్డీ రేటును ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.25 శాతం వడ్డీని అందిస్తుంది.

Also Read : ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచిన Indian Bank!

Advertisement

Next Story

Most Viewed