- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, డీజిల్, ఏటీఎఫ్ లపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను కేంద్రం సవరించింది. దీని వలన పెట్రోలియం పరిశ్రమలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. ముడి చమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను టన్నుకు రూ. 4350 నుంచి రూ. 4400 కు పెంచింది. దీంతో ముడి చమురు ధరలు పెరగనున్నాయి. అయితే, డీజిల్‌పై ఎగుమతి సుంకం లీటరుకు రూ. 2.50 నుండి రూ.0.5కు తగ్గించారు. అలాగే విమానయాన పరిశ్రమ కోసం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతి సుంకాన్ని రద్దు చేశారు. దీంతో కరోనా సమయంలో విమానయాన సంస్థలు ఎదుర్కొన్న నిర్వహణ ఖర్చుల నష్టాల నుంచి బయటపడటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సవరించిన ఈ రేట్లు మార్చి 4 నుంచి అమలులోకి రానున్నాయి.
అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి పదిహేను రోజులకు పన్ను రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. చమురు ఉత్పత్తి చేసే సంస్థలు ప్రతి బ్యరెల్‌కు 75 డాలర్ల కంటే ఎక్కువ ధరపై లాభాలు సంపాదిస్తే వాటిపై కేంద్రం పన్ను విధిస్తుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తోపాటు, రోస్‌నెఫ్ట్ (రష్యా) మద్దతు గల నయారా ఎనర్జీ మన దేశం నుంచి ఎగుమతి చేస్తున్న ప్రైవేటు కంపెనీలుగా ఉన్నాయి.