- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Car price hikes: కార్ల వినియోగదారులకు షాక్.. జనవరి 1 నుంచి పెరగనున్న ధరలు

దిశ, బిజినెస్: వచ్చే ఏడాది కార్లు కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. కార్ల తయారీ కంపెనీలు(Carmakers) కార్ల ధరలు పెంచెందుకు రెడీ అవుతున్నాయి. జనవరి 1 నుంచి ధరలు పెంచుతామని కార్ల కంపెనీలు తెలిపాయి. దేశంలోని అతిపెద్ద ఆటోమెబైల్ దిగ్గజం మారుతి సుజుకీ(Maruti Suzuki) నుంచి హై ఎండ్ లగ్జరీ మోడళ్ల వరకు దాదాపు అన్ని రకాల కార్ల ధరలు పెంచనున్నట్లు ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించాయి. మారుతి సుజుకీ, హ్యుండాయ్(Hyundai), మహీంద్రా అండ్ మహీంద్రా(Mahindra and Mahindra (M&M)), జేఎస్‌డబ్ల్యూ( JSW) ఎంజీ మోటార్(MG), మెర్సిడెజ్ బెంజ్, ఆడి(Audi), బీఎండబ్ల్యూ(BMW) వంటి టాప్ కంపెనీలు 1- 4 శాతం ధరలు పెంచనున్నట్లు వెల్లడించాయి. మోడల్‌ను బట్టి ధరల సవరణలు మారుతాయని మారుతీ సుజుకి కార్ల తయారీదారులు పేర్కొన్నారు. హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీఎండబ్ల్యూ కూడా ఇదే రకమైన స్ట్రాటజీని వాడనున్నట్లు తెలుస్తోంది.
ఉత్పత్తి వ్యయం వల్లే..
మారుతి సుజుకి కార్ల ధరలు 1- 4 శాతం పెరగనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ధరలు పెరిగాయని మారుతి సుజుకీ కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల, ప్రతికూల మారకపు రేటు, కార్యకలాపాల నిర్వహణ ఖర్చుల పెరుగుదల వల్ల కార్ల ధరలు పెంచుతున్నట్లు హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) పేర్కొంది. అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వ్యయ పెరుగుదల వల్లే ధరలు పెంచడం అత్యవసరంగా మారిందని HMIL హోల్-టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు. ఒక్కో కారు మీద దాదాపు 25 వేల ధరలు పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించారు. మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎస్‌యూవీలు, కమర్షియల్ వెహికల్స్ ధరలను 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. అన్ని రకాల కార్ల రేట్లను 3 శాతం వరకు పెంచుతామని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. లగ్జరీ కార్ల కంపెనీలు మెర్సిడెజ్ బెంజ్, ఆడీ కంపెనీలు కూడా వాహనాల రేట్లను 3 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇకపోతే, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం, కార్ల ధరల సవరణలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అయితే, జనవరిలో అమ్మకాలపై వీటి ప్రభావం తాత్కాలికంగానే ఉంటుంది. మరోవైపు, కార్లు కొనాలన్న ప్రణాళికలను వాయిదా వేస్తున్న కస్టమర్లను ఆకర్షించేందుకే ధరల సవరణ అనే జిమ్మిక్కు వాడుతున్నట్లు ఆటోమొబైల్ రంగం నిపుణులు అంటున్నారు.