Budget 2024 : బడ్జెట్‌-2024లో కీలక అంశాలు

by Harish |   ( Updated:2024-02-01 07:22:34.0  )
Budget 2024 : బడ్జెట్‌-2024లో కీలక అంశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ ఓట్‌ఆన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లు. 2023-24 నాటికి రెవెన్యూ ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా ఉంది. అలాగే, ఈ ఏడాది అప్పులు రూ.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. ద్రవ్యలోటు 5.8 శాతంగా నమోదైంది. బడ్జెట్ సమర్పణ సందర్భంగా మంత్రి తన ప్రసంగంలో పలు రంగాల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రాబోయే ఎన్నికలకు ముందు ఈ బడ్జెట్ ప్రభుత్వానికి కీలక కావడంతో మధ్య తరగతి ప్రజల మనస్సును గెలుచుకోవడానికి కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం పై ఎలాంటి పన్ను లేదని ప్రకటించారు. అలాగే మరిన్ని అంశాలపై కూడా కీలక ప్రకటనలు చేశారు.

బడ్జెట్‌-2024లో ముఖ్యాంశాలు:

* వచ్చే ఐదేళ్లలో పీఎం కిసాన్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం.

* రూఫ్ టాప్ సోలార్ క్రింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్.

* అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయూష్మాన్ భారత్ కవరేజ్‌.

* ఐదు సమీకృత ఆక్వా పార్కుల ఏర్పాటు.

* లక్ పతీ దీదీ టార్గె‌ట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెరుగుదల.

* కొత్తగా మెడికల్ కాలేజ్‌ల కోసం కమిటీ ఏర్పాటు.

* నానో యూరియా తర్వాత పంటలకు నానో డీఏపీ కింద రైతులకు ఎరువులు

* పరిశోధన రంగాలకు రూ.లక్షల కోట్ల నిధి ఏర్పాటు.

* టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్.

* టూరిజం కోసం వడ్డీలేని రుణాలు

* మూడు ఎకానమిక్, లాజిస్టిక్ కారిడార్‌ల ఏర్పాటు.

* మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లు.

* 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు.

* 40 వేల సాధారణ బోగీలను వందేభారత్ మోడల్‌లోకి మార్చనున్నారు.

* మూడు రైల్వే కారిడార్ల నిర్మాణం.

* స్టార్టప్‌ల కోసం రూ. 43 వేల కోట్ల రుణాలు.

* కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు.

Advertisement

Next Story