భారీ పెట్టుబడులు ప్రకటించిన బీపీసీఎల్!

by Vinod kumar |
భారీ పెట్టుబడులు ప్రకటించిన బీపీసీఎల్!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సోమవారం భారీ పెట్టుబడులను ప్రకటించింది. 2040 నాటికి నిక్ర సున్నా ఉద్గార లక్ష్యంలో భాగంగా చమురు వ్యాపార వృద్ధికి, పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో విస్తరణ కోసం ఐదేళ్లలో రూ. 1.50 లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్టు బీపీసీఎల్ ఛైర్మన్ జి కృష్ణకుమార్ అన్నారు. 2047 నాటికి ఇంధన రంగంలో భారత్‌ను ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు తమ వంతు కృషి చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఈ ఏడాది భారత్ ఒమన్ రిఫైనరీని బీపీసీఎల్‌లో విలీనం చేయడంతో చమురు శుద్ధి సామర్థ్యానికి కీలక ప్రోత్సాహం లభించిందన్నారు. అలాగే, బీపీసీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 7 వేల ఎనర్జీ స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ సౌకర్యాలు, ఇథనాల్ మిశ్రమం పెంపు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు వంటి లక్ష్యాలు ఉన్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు. 2025 నాటికి 1 గిగావాట్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, 2040 నాటికి 10 గిగావాట్‌ను సొంతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed