రాజీనామా చేసిన బోయింగ్ సీఈఓ

by S Gopi |
రాజీనామా చేసిన బోయింగ్ సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ కీలక ప్రకటన వెలువరించింది. కంపెనీ సీఈఓగా ఉన్న డేవ్ కల్హౌన్ తన బాధ్యతల నుంచి వైదొలగుతారని వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరు కల్లా ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల జనవరిలో బోయింగ్ విమానం 737 మ్యాక్స్ విమానం డోరు ఊడిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కంపెనీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సంస్థ సీఈఓ కంపెనీ నుంచి వైదొలగనుండటం గమనార్హం. ఆయనతో పాటు బోయింగ్ కమర్షియల్ విమానాల విభాగం హెడ్ స్టాన్ డీల్ సైతం త్వరలో పదవీ విరమణ చేస్తారని కంపెనీ తెలిపింది. ఆయన స్థానంలో స్టెఫానీ పోప్, బోర్డు ఛైర్మన్‌గా స్టీవ్ మోలెన్‌కోఫ్ బాధ్యతలు తీసుకుంటారని కంపెనీ వెల్లడించింది. జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే డోర్ విరిగిపడింది. ఈ ఘటనతో బోయింగ్‌పై నియంత్రణ సంస్థల నిఘా పెరిగింది. గతంలో సైతం ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిన సంఘటనతో దాదాపు 350 మంది మరణించారు. ఈ పరిణామాలతో కంపెనీ విమానాల నాణ్యత, భద్రతపై తనిఖీలు తీవ్రమయ్యాయి. ఈ మధ్యే జరిగిన అమెరికా విమానాయాన సంస్థ సీఈఓల సమావేశంలో దీనిపై చర్చకు రాగా, విమర్శలను దృష్టిలో పెట్టుకుని డేవ్ కల్హౌన్ తన నిర్ణయాన్ని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed