రెండేళ్ల తర్వాత తిరిగి ట్రిలియన్ డాలర్లకు బిట్‌కాయిన్

by S Gopi |
రెండేళ్ల తర్వాత తిరిగి ట్రిలియన్ డాలర్లకు బిట్‌కాయిన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండేళ్ల తర్వాత మొదటిసారి ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బుదహ్వారం బిట్‌కాయిన్ 3 శాతం పెరిగి 51,200 కి చేరుకున్న తర్వాత 1 ట్రిలియన్ డాలర్ల మార్కును తిరిగి సాధించింది. కాయిన్‌మార్కెట్‌క్యాప్ నివేదిక ప్రకారం, గడిచిన ఏడు రోజుల్లో బిట్‌కాయిన్ 19.5 శాతం పెరిగింది. చివరిసారిగా 2021, నవంబర్‌లో బిట్‌కాయింట్ ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరింది. క్రిప్టోకరెన్సీ మార్కెట్‌పై సందేహాలు, పరిశ్రమలో కుంభకోణాల కారణగా పతనమైన బిట్‌కాయిన్ ఈ నెల ప్రారంభంలో రెండేళ్ల తర్వాత తిరిగి 50,000 డాలర్ల మార్కుని దాటింది. అయితే, ఇప్పటికీ 2021, నవంబర్‌లో సాధించిన గరిష్ఠ స్థాయి 69,000 డాలర్ల కంటే బిట్ కాయిన్ చాలా తక్కువలోనే ట్రేడవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఏడాది జనవరి రెండోవారంలో అమెరికాలో బిట్‌కాయిన్ స్పాట్ ఎక్స్‌ఛేంజ్ ఈటీఎఫ్‌లు ఆమోదం పొందడం వల్ల దాని విలువ అమాంతం పెరిగింది. ఈటీఎఫ్‌ల యాక్సెస్‌తో క్రిప్టో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని అంచనా. ఈ కారణంతో బిట్‌కాయిన్ విలువ ర్యాలీ చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed