BIG Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు ఈ సమయాల్లో యూపీఐ సేవలు బంద్..!

by Maddikunta Saikiran |
BIG Alert: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు ఈ సమయాల్లో యూపీఐ సేవలు బంద్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్(Private Sector Bank) హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) తన బ్యాంక్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సిస్టమ్ అప్ గ్రేడ్(System Upgrade)లో భాగంగా తమ కస్టమర్లకు మరోసారి అంతరాయం కలగనుందని తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ తన వెబ్‌సైట్‌లోపేర్కొంది. ఈ నెల 5,23 తేదీల్లో తాత్కాలికంగా యూపీఐ సేవలు(UPI Services) నిలిపివేస్తున్నామని ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలిపిన సమాచారం ప్రకారం నవంబర్ 5న అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, నవంబర్ 23న 12 గంటల నుంచి 3 గంటల వరకు యూపీఐ సర్వీసులు అందుబాటులో ఉండవు. ఇక ఈ సమయాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ సేవలతో పాటు మొబైల్ బ్యాంకింగ్, సేవింగ్స్ అకౌంట్, జీపే, వాట్సాప్ పే, పేటీఎం,రూపే క్రెడిట్ కార్డు వంటి సేవలు పనిచేయవు. తమ బ్యాంక్ కస్టమర్లు అసౌకర్యానికి గురికాకూడదనే ముందస్తుగా సమాచారం అందిస్తున్నామని, ఖాతాదారులు తమకు అవసరమైన నగదును ముందే ఉపసంహరించుకోవాలని హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది.

Advertisement

Next Story