BIG Alert: మీరు OnePlus ఫోన్ వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఏంటది..?

by Maddikunta Saikiran |
BIG Alert: మీరు OnePlus ఫోన్ వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. ఏంటది..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మొబైల్ దిగ్గజం, చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్(OnePlus) ఫోన్ గురించి తెలియనివారుండరు. అనతి కాలంలోనే భారతదేశంలో ప్రాచుర్యం పొందిన స్మార్ట్ ఫోన్లలో నవ్‌ప్లన్ ఒకటి.ముఖ్యంగా యువత ఈ కంపెనీ ఫోన్లను అత్యధికంగా వినియోగిస్తోంది.కాగా వన్ ప్లస్ తరుచుగా ఏదోఒక సమస్యతో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.తాజాగా మరో సమస్యతో వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. OnePlus 9,10 మోడల్ ఫోన్లలో లేటెస్ట్ సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయగానే మదర్ బోర్డ్ సమస్య వస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ ఒక్క సారిగా ఆగిపోయి, సిమ్ కార్డులు పని చేయట్లేదని అంటున్నారు.దీంతో యూజర్లు OnePlus పై ఫైర్ అవుతున్నారు.అయితే ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవడం ఆపేయాలని కొందరు టెక్ నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఈ సమస్యను సరిచేయడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నామని OnePlus చెబుతోంది. OnePlus వినియోగదారులు లేవనెత్తుతున్న సమస్య ఈ కంపెనీకి కొత్తదేమీ కాదు. గతంలో కూడా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల తర్వాత OnePlus స్మార్ట్‌ఫోన్‌లలో నిలువు వరుసలు కనిపించడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed