Airtel: వింక్ మ్యూజిక్ యాప్‌ సేవలు నిలిపేయనున్న ఎయిర్‌టెల్

by S Gopi |
Airtel: వింక్ మ్యూజిక్ యాప్‌ సేవలు నిలిపేయనున్న ఎయిర్‌టెల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ తన వింక్ మ్యూజిక్ సేవలను నిలిపేయనున్నట్టు సమాచారం. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్‌తో కుదిరిన భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ యాప్‌కు స్వస్తి పలికి, అందులోని ఉద్యోగులందరినీ ఎయిర్‌టెల్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. 'మరో రెండు నెలల్లో వింక్ మ్యూజిక్‌ను మూసివేసే ప్రణాళికపై పనిచేస్తున్నాం. ఇందులోని ఉద్యోగులను ఎయిర్‌టెల్‌కు మార్చడం జరుగుతుంది. ఇకమీదట ఎయిర్‌టెల్ వినియోగదారులు యాపిల్ నుంచి వింక్ మ్యూజిక్ సేవలను పొందవచ్చు. ప్రీమియం కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ప్రత్యేక ఆఫర్‌ను ఇస్తుందని ' కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Advertisement

Next Story