Bengaluru Restaurant: షూ వేసుకోలేదని స్టార్టప్ కంపెనీ సీఈఓకు ఎంట్రీ నిరాకరించిన బెంగళూరు రెస్టారెంట్‌

by S Gopi |
Bengaluru Restaurant: షూ వేసుకోలేదని స్టార్టప్ కంపెనీ సీఈఓకు ఎంట్రీ నిరాకరించిన బెంగళూరు రెస్టారెంట్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ రైతు పట్ల ప్రవర్తించిన అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి. వ్యవహారం తీవ్ర విమర్శల పాలవడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ షాపింగ్ మాల్‌ను వారం రోజుల పాటు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితే తనకూ ఎదురైందని ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఫ్రిడో వ్యవస్థాపకుడు, సీఈఓ గణేష్ సోనవానే చెప్పారు. తనతో పాటు ఈవీ స్టార్టప్ సహ-వ్యవస్థాపకుడు స్వప్నిల్ జైన్ కూడా మా ఇద్దరి డ్రెస్ కోడ్ కారణంగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లలో ప్రవేశించేందుకు అనుమతివ్వలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తాను స్వప్నిల్ జైన్‌తో కలిసి వెళ్లినప్పుడు షూ బదులు చెప్పులు వేసుకుని వెళ్లామని, అవి తమ డ్రెస్ కోడ్‌తో సరిపోలడం లేదు. ఆ కారణంతో మా ఇద్దరినీ లోపలికి వెళ్లేందుకు రెస్టారెంట్ సిబ్బంది నిరాకరించారని వివరించారు. అయితే, తాము దాన్ని పట్టించుకోలేదు. మరో రెస్టారెంట్‌కు వెళ్లాం. దాన్ని వివక్ష అనుకోవట్లేదని, తన జీవితంలో జరిగిన సంఘటనను పంచుకోవాలనిపించిందని గణేష్ సోనవానే పేర్కొన్నారు.



Next Story