- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Banks: గత ఐదేళ్లలో రూ.9.90 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన బ్యాంకులు
దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయంగా బ్యాంకులు రూ. 9.90 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయని ప్రభుత్వం తెలిపింది. 2023-24లో బ్యాంకుల రుణమాఫీ రూ. 1.70 లక్షల కోట్లకు చేరిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 2.08 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ మంగళవారం రాజ్యసభలో తన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అత్యధికంగా 2019-20లో రూ. 2.34 లక్షల కోట్లు రైటాఫ్ అయ్యాయి. ఆ తరువాతి సంవత్సరంలో రూ. 2.02 లక్షల కోట్లకు, 2021-22లో రూ. 1.74 లక్షల కోట్లకు తగ్గాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం, నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి ప్రొవిజనింగ్ చేయబడిన వాటితో సహా, ఎన్‌పీఏలు రైటాఫ్ కింద సంబంధిత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించబడతాయి. మొత్తం రూ. 9.90 లక్షల కోట్ల మాఫీలో రూ. 1.84 లక్షల కోట్లు రికవరీ అయ్యాయని, గత ఐదేళ్లలో మొత్తం రైటాఫ్‌లో ఇది 18 శాతం మాత్రమే కావడం గమనార్హం.