రుణ వసూళ్లలో బ్యాంకులు సున్నితంగా వ్యవహరించాలి: Nirmala Sitharaman!

by Vinod kumar |   ( Updated:2023-07-24 14:56:16.0  )
రుణ వసూళ్లలో బ్యాంకులు సున్నితంగా వ్యవహరించాలి: Nirmala Sitharaman!
X

న్యూఢిల్లీ: రుణ వసూళ్లకు సంబంధించి అప్పు తీసుకున్న వారితో సున్నితంగా వ్యవహరించాలని బ్యాంకులకు సూచించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ) ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ఈ విషయంపై సూచనలిచ్చామని ఆమె పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్న వారి పట్ల బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన వైఖరి గురించి పార్లమెంటులో అడిగిన ఓ ప్రశ్నకు సమాధినమిస్తూ, ఇది చాలా సున్నితమైన అంశమని, కొన్ని బ్యాంకులు రుణాలను వసూలు చేసే అమయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తరచుగా ప్రభుత్వం దృష్టికి వస్తోందని, దానిపై ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను అటువంటి పద్దతిని అనుసరించవద్దని చెప్పినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు.

రుణ వసూళ్ల వ్యవహారంలో మానవత్వంతో వ్యవహరించాల్సిందిగా సూచించామని పేర్కొన్నారు. రుణాల వాయిదాలను రికవరీ చేసే సమయంలో బ్యాంకులకు సంబంధించిన ప్రతినిధులు కొందరు వినియోగదారులతో దురుసుగా వ్యవహరించిన ఘటనలు దేశవ్యాప్తంగా నెలకొంటున్నాయి. కొందరు భౌతిక హింసకు పాల్పడిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఈ అంశంపై ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story