- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగపూర్, హాంకాంగ్‌ల కంటే ఎక్కువగా భారత బ్యాంకర్ల జీతాలు
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారితో పాటు మొత్తం ఆర్థిక రంగంలో ఉన్న ఉద్యోగుల జీతాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని ఓ నివేదిక తెలిపింది. ఈ ఏడాదికి వారి జీతం 10 శాతం పెరగనుందని, ఇది సింగపూర్, హాంకాంగ్ లాంటి కీలక ఆర్థిక దేశాల 4 శాతం కంటే చాలా ఎక్కువని బ్లూమ్‌బర్గ్ ఇంటిలిజెన్స్ అంచనా వేసింది. ఇటీవల డీబీఎస్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్, జూలియస్ బేర్ లాంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీలు భారత మార్కెట్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కారణంగానే దేశీయ ఆర్థిక రంగంలోని వివిధ విభాగాల్లో ప్రొఫెషనల్స్‌కు అత్యధిక గిరాకీ ఏర్పడింది. కానీ, డిమాండ్ ఉన్నప్పటికీ ఉద్యోగులు ఆ స్థాయిలో లేరని నివేదిక పేర్కొంది. అందుకే ఉన్న ఉద్యోగులకు ఎక్కువ జీతాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు, భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి వేగంగా కొనసాగుతుండటం కూడా కంపెనీలు ఇందుకు సానుకూలంగా మారేందుకు వీలవుతోంది. ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్‌ల కంటే ముంబై, గిఫ్ట్ సిటీ లాంటి ప్రాంతాల్లోని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. వీరి జీతం సగటున హాంకాంగ్ కంటే 4.5 శాతం, సింగపూర్ కంటే 7.7 శాతం ఎక్కువగా ఉంది.