- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఒత్తిడి ఉండటంతో అధిక లాభాల నుంచి కొంత వెనక్కి తగ్గినప్పటికీ దేశీయంగా కీలక ఆటో, మెటల్, ఎనర్జీ రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో మోస్తరు లాభాలతో సరిపెట్టాయి. ప్రధానంగా అమెరికా ఫెడ్‌తో పాటు జపాన్, యూకే సెంట్రల్ బ్యాంకులు ఈ వారంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదే సమయంలో ముడి చమురు ధరల పెరడం ర్యాలీని ప్రభావితం చేసింది. అయితే, దిగ్గజ రిలయన్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు కొనసాగించడంతో తీవ్ర ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ సానుకూలంగా ముగిసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 104.99 పాయింట్లు లాభపడి 72,748 వద్ద, నిఫ్టీ 32.35 పాయింట్ల లాభంతో 22,055 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్, ఆటో రంగాలు 1 శాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎంఅండ్ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, రిలయన్స్ కంప్నీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టైటాన్, విప్రో, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.89 వద్ద ఉంది.