ఫార్ములా 1 రేస్‌లోకి Audi.. ఆ ఏడాదే ఛాంపియన్‌షిప్‌తో ఎంట్రీ..

by Javid Pasha |   ( Updated:2022-08-27 03:12:50.0  )
ఫార్ములా 1 రేస్‌లోకి Audi.. ఆ ఏడాదే ఛాంపియన్‌షిప్‌తో ఎంట్రీ..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన కార్ల సంస్థల్లో ఆడి ఒకటి. ప్రముఖులు సైతం ఈ సంస్థ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇన్నాళ్లు ఖరీదైన కార్లుగానే ఉన్న ఆడి సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జర్మన్ తయారీ సంస్థ ఆడి ఫార్ములా 1 రేస్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. 2026లో జరగనున్న ఫార్ములా 1 ఛాంపియన్‌షిప్‌లో పవర్ యూనిట్ సప్లయర్‌గా పాల్గొనేందుకు ఆడి సిద్ధమయింది. ఈ మేరకు విషయాన్ని తయారీ సంస్థ అధికారులు వెల్లడించారు.

'2026లో జరగనున్న ఫార్ములా 1 ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టుతో జతకట్టనుందన్న విషయాన్నీ తయారీ సంస్థ ఈ ఏడాది చివరికి వెల్లడించనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న ఆడీ పవర్ యూనిట్ జర్మనీ న్యూబర్గ్‌లోని స్పోర్ట్స్ ఫెసిలిటీలో తయారు కానుంది' అని సంస్థ అధికారులు వెల్లడించారు. దీంతో ఆడి ప్రేమికులు ఈ ఛాంపియన్‌షిప్‌లో ఏమాత్రం రాణిస్తుందో అని ఇప్పటి నుంచే ఊహాగానాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed