Ashok Leyland: అక్టోబర్ నెలలో తగ్గిన అశోక్ లేలాండ్ వాహనాల విక్రయాలు

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-04 12:54:06.0  )
Ashok Leyland: అక్టోబర్ నెలలో తగ్గిన అశోక్ లేలాండ్ వాహనాల విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూజా గ్రూప్(Hinduja Group)కు చెందిన ప్రముఖ దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (Ashok Leyland) వాహన అమ్మకాలు(Vehicles Sales) అక్టోబర్ నెలలో తగ్గిపోయాయి. పోయిన నెలలో ఆ సంస్థకు చెందిన వాహన విక్రయాలు 15,310 యూనిట్లకు పడిపోయాయి. కాగా గతేడాది ఇదే సమయంలో ఆ సంస్థ మొత్తం 16,864 యూనిట్లను విక్రయించింది. పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో విక్రయించిన వాహనాలతో పోల్చుకుంటే ఈ సారి 8 శాతం క్షీణించాయిని సంస్థ వెల్లడించింది. కాగా అక్టోబర్ లో ఎగుమతులతో సహా మొత్తం మీడియం, హెవీ కామర్స్ వెహికల్ విక్రయాలు 9,408 యూనిట్లగా నమోదయ్యాయి. అలాగే స్మాల్ కామర్స్ వెహికల్ అమ్మకాలు కూడా 12 శాతం క్షీణించి 5,902 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా గతేడాది అక్టోబర్ నెలలో స్మాల్, మీడియం, హెవీ వెహికల్ విక్రయాలు 15,759 యూనిట్లుగా నమోదు కాగా ఈ సారి 11 శాతం తగ్గి 14,067కు చేరుకున్నాయి.

Advertisement

Next Story