గడువు ముగుస్తున్న వేళ భారీగా ఐటీ రిటర్నుల దాఖలు!

by Vinod kumar |
గడువు ముగుస్తున్న వేళ భారీగా ఐటీ రిటర్నుల దాఖలు!
X

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5.83 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయని పన్నుల శాఖ వెల్లడించింది. ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు భారీగా ఈ-ఫైలింగ్ కోసం పోటీపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం సమయానికి 5.83 కోట్ల ఐటీఆర్‌లు నమోదయ్యాయని, దాంతో గతేడాది జూలై 31 వరకు దాఖలైన సంఖ్య కంటే ఈసారి పెరిగాయని ఆదాయ పన్ను శాఖ ట్విటర్ ద్వారా పేర్కొంది. ఆదివారం మద్యాహ్నం వరకు 46 లక్షలకు పైగా ఫైలింగ్‌లు నమోదయ్యాయని, శనివారం ఏకంగా 1.78 కోట్ల మంది పోర్టల్‌లో లాగ్-ఇన్ అయ్యారని వెల్లడించింది.

ఆదివారం 2 గంటల సమయానికి 3.04 లక్షల ఐటీఆర్‌లు దాఖలైనట్టు పన్ను శాఖ వివరించింది. మరోవైపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువు పొడిగింపు ఉండదని ఆదాయ పన్ను శాఖ మరోసారి స్పష్టం చేసింది. పోర్టల్‌లో సాంకేతికత సమస్యలు ఎదురైన కారణంగా గడువు పొడిగించాలని ట్విటర్‌లో ఓ వ్యక్తి కోరగా, దానిపై స్పందించిన ఐటీ శాఖ, తాము ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ పాన్, ఫోన్ నంబర్, సంబంధిత సమస్య స్క్రీన్‌షాట్ వివరాలు ఇవ్వాలని, ఐటీ శాఖ నుంచి స్పందించనున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed