Iphone 16: ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ డేట్ ఇదే..కొత్త డిజైన్, ఫీచర్లు

by S Gopi |
Iphone 16: ఐఫోన్ 16 సిరీస్ రిలీజ్ డేట్ ఇదే..కొత్త డిజైన్, ఫీచర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బాండ్ యాపిల్ సంస్థ తన సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ నెల 10న లాంచ్ చేయనుంది. వచ్చే మంగళవారం జరగనున్న లాంచ్ ఈవెంట్‌లో ఐఫోన్‌ 16ను రిలీజ్‌ చేయనుంది. లాంచింగ్‌ తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే కొత్త సిరీస్ ధర, ఫీచర్లపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఇదివరకే ఐఫోన్‌ 16కు సంబంధించి లీకులు వచ్చాయి. నివేదికల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ కోసం యాపిల్ ఉత్పత్తి సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ సిరీస్‌లోని నాలుగు మోడల్‌లు అనుకున్న ప్రకారం విడుదల తేదీ నుంచే అందుబాటులోకి తెచ్చేందుకు యాపిల్ ప్రయత్నిస్తోంది. కొత్త సిరీస్ ఐఫోన్ 16లో డ్యుయెల్ కెమెరా సెటప్‌తో రానున్నట్టు లీకులు వచ్చాయి. అవి 48ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉండనున్నాయి. అలాగే, డిజైన్‌ విషయంలో యాపిల్ మార్పులు చేసినట్టు సమాచారం. ఐఫోన్‌16, ఐఫోన్‌16 ప్లస్‌లలో వెనుకవైపు ప్యానెల్‌లో డ్యూయల్‌ కెమెరాలతో గ్రాండ్‌ లుక్‌, పెద్ద స్క్రీన్‌ ఉండవచ్చు. ఐఫోన్‌16లో 6.1 అంగుళాలు, ఐఫోన్‌16 ప్రోలో 6.3 అంగుళాలు, ప్రోమాక్స్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. ఐఫోన్‌ 16 సిరీస్‌లో సరికొత్త ఏ18 బయోనిక్‌ చిప్‌సెట్‌ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, దీనిపై యాపిల్ స్పష్టత ఇవ్వలేదు. ధరలకు సంబంధించి కూడా ఐఫోన్ 15 కంటే తక్కువగా ఉండొచ్చని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story