భారత ప్రధాని మోదీని కలిసిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్!

by Harish |
భారత ప్రధాని మోదీని కలిసిన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్!
X

న్యూఢిల్లీ: ఇటీవల ముంబైలో తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ గురువారం రెండవ స్టోర్‌ను దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి చేరుకున్న టిమ్ కుక్ బుధవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మోదీతో జరిగిన సమావేశం గురించి ట్విట్టర్ కేంద్రంగా వివరిస్తూ, విద్య, అభివృద్ధి నుంచి తయారీ, పర్యావరణం వరకు దేశ భవిష్యత్తుపై టెక్నాలజీ పరివర్తనలు చూపుతున్న సానుకూల ప్రభావం పట్ల ఆనందంగా ఉందన్నారు.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం సంతోషంగా ఉందని మోదీ సైతం బదులిచ్చారు. భారత్‌లో జరుగుతున్న టెక్నాలజీ పరివర్తనను ప్రస్తావించడం ఆనందంగా ఉందన్నారు. కాగా, భారత పర్యటనలో భాగంగా టిమ్ కుక్ మంగళవారం ముంబైలో తొలి స్టోర్ ప్రారంభించారు. కంపెనీ దేశంలో తన భాగస్వాముల ద్వారా యాపిల్ ఉత్పత్తులు, సేవలను అందించడం మొదలుపెట్టిన 25 ఏళ్ల తర్వాత కార్యకలాపాలను ప్రారంభించడం గమనార్హం.

Advertisement

Next Story