హైదరాబాద్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల తయారీ!

by Harish |   ( Updated:2023-08-15 11:14:36.0  )
హైదరాబాద్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్‌ల తయారీ!
X

హైదరాబాద్: ఐఫోన్ తయారీ బ్రాండ్ యాపిల్‌కు చెందిన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఎయిర్‌పాడ్‌ల తయారీని, కాంట్రాక్ట్ కంపెనీ ఫాక్స్‌కాన్ హైదరాబాద్ ప్లాంటులో ప్రారంభించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2024, డిసెంబర్ నాటికి భారీ స్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉందని, అందుకోసం సుమారు రూ. 3,350 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.

యాపిల్‌కు దేశీయ తయారీలో ఐఫోన్ తర్వాత ఎయిర్‌పాడ్‌లు రెండో అతిపెద్ద ఉత్పత్తి. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌కు చెందిన ఈ ఎయిర్‌పాడ్‌లు మార్కెట్లో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ప్రముఖ మార్కెట్ పరిశోధనా సంస్థ కెనాలసిస్ ప్రకారం, 2022, డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ ఎయిర్‌పాడ్ 36 శాతం వాటాతో ఈ విభాగంలో గణనీయమైన వృద్ధిని కొనసాగించింది.

Next Story