- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anil Ambani: అనిల్ అంబానీకి భారీ ఎదురుదెబ్బ.. మూడేళ్ల పాటు ఆ కంపెనీలపై నిషేధం!
దిశ, వెబ్‌డెస్క్: మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా మారింది అనిల్ అంబానీ (Anil Ambani) పరిస్థితి. నకిలీ బ్యాంక్ గ్యారంటీ (Fake Bank Guarantees)లు ఇచ్చేరనే అభియోగంతో రిలయన్స్ పవర్ (Reliance Power)తో పాటు అనుబంధ సంస్థలపై సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Solar Energy Corporation of India Limited) మూడేళ్ల పాటు నిషేధం విధించింది.
కాగా, ఎస్‌ఈసీఐ (SECI) గత జూన్ మాసంలో 1 గిగావాట్ సోలార్ పవర్ (Gigawatt of Solar Power), 2 గిగావాట్ స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ (Gigawatt Standalone Battery Energy Solar System) కోసం టెండర్లను ఆహ్వనించింది. అయితే, ఆ బిడ్‌లో అన్ని కంపెనీలతో పాటు రిలయన్స్ పవర్ (Reliance Power) అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్‌బెస్ కూడా పాల్గొంది. టెండర్ దక్కాలంటే బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించాల్సి ఉండటంతో చివరి రౌండ్ బిడ్డింగ్‌లో రిలయన్స్ ఎన్‌బెస్ సంస్థ నకిలీ గ్యారెంటీలను సబ్మిట్ చేసింది. ఈ పరిణామంతో టెండర్ ప్రక్రియను నిలిపివేసి రిలయన్స్ పవర్ (Reliance Power) అనుబంధ సంస్థ రియలన్స్ ఎన్‌బెస్‌పై చర్యలు తీసుకున్నట్లుగా ఎస్ఈసీఐ (SECI) పేర్కొంది.