Amazon Republic Day Sale: అమెజాన్‌లో భలే ఫోన్.. హాఫ్ రేట్‌కే ఇచ్చేస్తున్నారు.. త్వరపడండి

by Bhoopathi Nagaiah |
Amazon Republic Day Sale: అమెజాన్‌లో భలే ఫోన్.. హాఫ్ రేట్‌కే ఇచ్చేస్తున్నారు.. త్వరపడండి
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ జనవరి 13వ తేదీ నుంచి షురూ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ జనవరి 12వ తేదీ నుంచి సేల్ లో పాల్గొనవచ్చు. మిడ్ రేంజ్ ఆప్షన్స్ నుంచి ప్రీమియం డివైజ్ ల వరకు పలు రకాల స్మార్ట్ ఫోన్స్ పై ఈ ఈవెంట్ భారీ డిస్కౌంట్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఎన్నో పాపులర్ మోడల్స్ పై డిస్కౌంట్ ధరలను అమెజాన్ ఇప్పటికే వెల్లడించింది.

ఐఫోన్ 15 :

రూ. 60, 499 విలువైన యాపిల్ ఐఫోన్ 15ను ఈ సేల్లో రూ. 56,999కు విక్రయించవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించినట్లయితే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో పాత ఫోన్ పై రూ. 22,800 వరకు లభిస్తుంది.

వన్ ప్లస్ 13:

బెస్ట్ సెల్లింగ్ ఫ్లాగ్ సిప్ వన్ ప్లస్ 13 16 జిబి 512జిబి వేరియంట్ ధర 79999. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఈ అమెజాన్( amazon)సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 6,499 కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గుతుంది. ఎక్స్చేంజ్ ప్రోగ్రాం రూ. 18 వేల వరకు ఉంటుంది. అంతేకాదు రూ.7, 000 అదన బోనస్ కూడా లభిస్తుంది. ఫలితంగా వన్ ప్లస్ 13 బేస్ మోడల్ ధర 39,999కు చేరుతుంది. అంటే సగం ధరకే ఈ స్మార్ట్ ఫోన్ దక్కించుకోవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5G

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఆల్ట్రా 12జిబి ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,49,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ కోడ్లతో రూ. 2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుదారులు 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ ఎంచుకోవచ్చు. పాత ఫోన్ కండిషన్ మోడల్ బట్టి ఈ డివైస్ పై ఎక్సైజ్ ఆఫర్ కింద 22,800వరకు లభిస్తుంది.

వన్ ప్లస్ నార్త్ సీఈ 4 లైట్ 5G:

ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 20,999గా ఉన్న ఈ ఫోన్ ధర రూ.17,999కి తగ్గింది. సెలక్ట్ చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్ ఛేంజ్ డివైజ్ కండిషన్ కు లోబడి రూ. 16,150 వరకు పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5G

శాంసంగ్ గెలాక్సీ ఎం 35 5 జీ ధరరూ. 24, 400 నుంచి 14,999కు తగ్గింది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, కూపన్ కోడ్లతో కొనుగోలు చేసినట్లయితే రూ. 1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డివైస్ కోసం ఎక్స్ ఛేంజ్ ఆఫర్ మోడల్, ఫోన్ కండిషన్ బట్టి రూ. 15, 950 వరకు ఉంటుంది.

Next Story