- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Infosys: రెండేళ్ల నిరీక్షణకు ఎండ్.. 1,000 మందికి ఇన్ఫోసిస్ జాయినింగ్ లెటర్స్
దిశ, బిజినెస్ బ్యూరో: రెండేళ్ల నిరీక్షణకు తాజాగా ఎండ్ పడింది. 2022లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపికైన ఫ్రెషర్‌లకు ఇన్ఫోసిస్ జాయినింగ్ లెటర్స్ పంపిస్తుంది. వివిధ విభాగాలకు ఎంపికైన 1,000 మందికి పైగా అభ్యర్థులకు లెటర్స్ వచ్చాయి. వీరంతా కూడా అక్టోబర్ 7 నుంచి ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని సమాచారం. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కూడా ఆఫర్ లెటర్‌లను కంపెనీ జారీ చేసిందని తెలిపింది. దాదాపు 2.5 ఏళ్ల ఆలస్యం తర్వాత ఇన్ఫోసిస్ ఇప్పుడు జాయినింగ్ లెటర్ ఇవ్వడం గమనార్హం.
NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ యువ ఇంజనీర్లు ఇప్పుడు ఉద్యోగంలో చేరబోతున్నారు. తమ ఉద్యోగాలను పొందడం కోసం బలంగా నిలిచిన విద్యార్థులందరికీ ఇది భారీ విజయం. ఇప్పటికే జాయినింగ్‌కు సంబంధించి చాలా ఆలస్యం అయింది, మరింత ఆలస్యం కాకుండా అప్రమత్తంగా ఉంటామని, అభ్యర్థుల తరపున నిలబడతామని, ఇన్ఫోసిస్ జాయినింగ్‌ను మరింత ఆలస్యం నేపథ్యంలో ఇన్ఫోసిస్ కార్యాలయం ముందు నిరసన చేయడానికి కూడా వెనుకాడమని ఆయన అన్నారు.
కొద్ది రోజుల క్రితం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ మాట్లాడుతూ, ఫ్రెషర్‌లకు ఇచ్చే ఆఫర్‌లను కంపెనీ పూర్తి చేసిందని వారందరినీ కూడా త్వరలో కంపెనీలో చేర్చుకుంటామని పేర్కొనగా, ఆయన ప్రకటన చేసిన తర్వాత అభ్యర్థులకు జాయినింగ్ లెటర్స్ ఇవ్వడం ప్రారంభించారు.