- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Afcons Infrastructure IPO: ఐపీఓకు సిద్ధమైన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. పూర్తి వివరాలు ఇవే..
దిశ, వెబ్డెస్క్: ఇటీవల కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్(Stock Market)లోకి ప్రవేశించేందుకు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పబ్లిక్ ఇష్యూల కోసం సంస్థలు లైన్ కడుతున్నాయి. తాజాగా దిగ్గజ వ్యాపార సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్(Shapoorji Pallonji Group)కు చెందిన ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Afcons Infrastructure Ltd) కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చేందుకు సిద్దమైంది. ఐపీఓ ద్వారా సుమారు రూ. 5,430 కోట్లను ఆ సంస్థ సమీకరించనుంది . ఇందుకు సంబంధించిన సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 25న ప్రారంభమై 29న బిడ్డింగ్ ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు(Anchor Investors) అక్టోబర్ 24నే విండో తేర్చుకోనుంది. లాట్ సైజ్, షేర్ల ధరను కంపెనీ వచ్చే వారం ప్రకటించనుంది. కాగా ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లో కంపెనీ ప్రమోటర్లు , ప్రమోటర్ గ్రూప్ ఎంటీటీలు 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. అయితే ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 600 కోట్లను లోన్స్ కట్టేందుకు, 320 కోట్లను లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం, రూ. 80 కోట్లను నిర్మాణ సామాగ్రి కోసం, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.