- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 34,900 కోట్ల విలువైన పెట్రో కెమికల్ ప్రాజెక్ట్ పనులను నిలిపేసిన అదానీ గ్రూప్!
ముంద్రా: అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ముంద్రాలో తన రూ. 34,900 కోట్ల విలువైన పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ పనులను నిలిపేసింది. అమెరికాకు చెందిన షార్ట్‌షెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా నెలకొన్న పరిస్థితుల మధ్య కార్యకలాపాలను పటిష్టం చేస్తూ, పెట్టుబడిదారుల్లో ఉన్న ఆందోళనను తగ్గించడంపై దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని కార్యకలాపాలు నిలిపేయాలని ఇటీవల విక్రేతలు, సరఫరాదారులకు అదానీ గ్రూప్ పంపిన మెయిల్ ద్వారా స్పష్టం చేసింది.
ముంద్రా పెట్రోకెమ్‌కు సంబంధించిన గ్రీన్ పీవీఎస్ ప్రాజెక్ట్ తదుపరి నోటీసులు వచ్చే వరకు, అన్ని రకాల పనులను ఆపేయనున్నాం. అనూహ్య పరిణామాల మధ్య పలు వ్యాపార విభాగాల్లో గ్రూప్ అమలు చేసిన వివిధ ప్రాజెక్టులను తిరిగి పరిశీలిస్తోంది. భవిష్యత్తు నగదు నిల్వలు, ఫైనాన్స్ ఆధారంగా కొన్ని ప్రాజెక్టుల కొనసాగింపు, పునఃపరిశీలన ఉంటుందని మెయిల్‌లో వివరించింది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ అదానీ పెట్రోకెమ్ 2021లో గుజరాత్‌లోని కచ్‌లో అదానీ పోర్ట్స్ ల్యాండ్‌లో గ్రీన్‌ఫీల్డ్ కోల్-టూ-పీవీసీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.