BMW గ్రూప్, టాటా టెక్నాలజీస్ మధ్య జాయింట్ వెంచర్

by Harish |
BMW గ్రూప్, టాటా టెక్నాలజీస్ మధ్య జాయింట్ వెంచర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బీఎండబ్ల్యూ గ్రూప్ తన ప్రీమియం వాహనాలకు సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్‌లు, ఐటీ సేవలను అందించడానికి దేశీయ దిగ్గజ సంస్థ టాటా టెక్నాలజీస్‌తో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి పూణె, బెంగళూరు, చెన్నైలలో ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, ఐటీ డెవలప్‌మెంట్ హబ్‌ను స్థాపించే లక్ష్యంతో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటుకు రెండు సంస్థలు మధ్య మంగళవారం ఒప్పందం కుదిరినట్లు కంపెనీల సంయుక్త ప్రకటన తెలిపింది.

బెంగళూరు, పూణేలలో ప్రధాన అభివృద్ధి, ఆపరేషన్స్ కేంద్రం ఏర్పాటు చేయబడతాయి, అదే చెన్నైలో వ్యాపార ఐటీ సొల్యూషన్స్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొదటగా ఈ జాయింట్ వెంచర్‌ను 100 మంది ఉద్యోగులతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచనున్నారు. ఈ ఒప్పందంపై మాట్లాడిన టాటా టెక్నాలజీస్ సీఈఓ, ఎండీ వారెన్ హారిస్, బీఎండబ్ల్యూ గ్రూప్‌తో మా సహకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఆటోమోటివ్ సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రశ్రేణి పరిష్కారాలను అందించడంలో మా నిబద్ధతను ప్రదర్శిస్తోందని అన్నారు.

మా గ్రూప్‌ కోసం వెహికల్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి టాప్-క్లాస్ ప్రాసెస్‌లు, టూల్స్‌తో పనిచేయడం వలన భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఆటోమేటెడ్ వంటి భవిష్యత్తు రంగాలలో అత్యాధునిక, ప్రీమియం ఆటోమోటివ్‌లలో మంచి అనుభవం వస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ సాఫ్ట్‌వేర్ ఈ ఆర్కిటెక్చర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ గ్రోట్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed