- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్షయ తృతీయ సందర్బంగా డైరెక్ట్‌గా బంగారం అమ్ముతున్న కేంద్రం
ముంబై: అక్షయ తృతీయ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్లుగా భావిస్తారు. అలాగే, ఏడాదంతా సిరిసంపదలు, నూతన పెట్టుబడులు, కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయని ప్రజల భావన. అందుకే అక్షయ తృతీయ రోజున ఎలాగైన బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు.
ఈ రోజున జరిగే అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులు నేరుగా ప్రభుత్వం నుంచి బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని మింట్ కేంద్రాల నుండి 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాముల విలువ గల బంగారం, వెండి నాణేలను ఆన్‌లైన్ లేదా ఫిజికల్‌గా కొనుగోలు చేసేలా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ అందుబాటులో ఉండే బంగారు నాణేలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ ప్రకారం ధృవీకరించబడి ఉంటాయని, 99.9 శాతం స్వచ్ఛతతో 24-క్యారెట్ బంగారాన్ని ఖచ్చితంగా పొందవచ్చని భారత ప్రభుత్వం అధికారికంగా ట్విట్టర్‌లో పేర్కొంది.
భారత ప్రభుత్వ మింట్ కేంద్రాలు
1. ఢిల్లీ: జవహర్ వ్యాపార్ భవన్,1వ అంతస్తు, జనపథ్, న్యూఢిల్లీ
2. నోయిడా:సెక్టార్ 1, D-2, నోయిడా
3. ముంబై: షాహిద్ భగత్ సింగ్ రోడ్, ముంబై
4. హైదరాబాద్: IDA ఫేజ్ II, చర్లపల్లి
5. కోల్‌కతా: అలిపోరి