తమిళనాడులో ఓలా కంపెనీ రూ.7,614 కోట్ల భారీ పెట్టుబడులు

by Harish |   ( Updated:2023-02-18 11:45:12.0  )
తమిళనాడులో ఓలా కంపెనీ రూ.7,614 కోట్ల భారీ పెట్టుబడులు
X

చెన్నై: సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీలను తయారు చేయడానికి తమిళనాడు రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ పెట్టుబడుల విలువ రూ. 7,614 కోట్లు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఓలా తన అనుబంధ సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్, ఓలా సెల్ టెక్నాలజీస్ కోసం ఈ పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా కొత్తగా 3,111 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రూ.7,614 కోట్లలో దాదాపు రూ.5,100 కోట్లు సెల్ తయారీ ప్లాంట్‌‌కి, మిగిలిన రూ. 2,500 కోట్లు సంవత్సరానికి 1.4 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్లాంట్ ఏర్పాటుకు వెళ్తాయి. ఓలా ఇప్పటికే రాష్ట్రంలో ఈ-టూ వీలర్లను తయారు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed