- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ మౌలిక సదుపాయాలు!
న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన ఐదు నెలల్లోనే 387 జిల్లాల్లో 5జీ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్ర టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, మొదటి దశలో భాగంగా 5జీ మౌలిక సదుపాయాలు అమలు చేశామని, 2024, డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరణ పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి పూర్తయిన జిల్లాల్లో లక్షల బేస్ ట్రాన్సీవర్ సెంటర్లు మెరుగ్గా పని చేస్తున్నాయని, ఇది ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న 200 జిల్లాల కంటే ఎక్కువని మంత్రి చెప్పారు. అలాగే, దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను వినియోగించేందుకు 18 దేశాలు ఆసక్తి చూపించాయని, 13 విదేశీ టెలికాం కంపెనీలు భారత నెట్‌వర్క్‌ను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఇక, మంగళవారం ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, దీపమ్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ, తాము ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ప్రతి పట్టణం, తాలూకాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. 5జీ భారత ఆర్థికవ్యవస్థపై మెరుగైన ప్రభావం చూపగలదని, దేశంలోని నగరాలను స్మార్ట్‌గా మారుస్తుందన్నారు.