కరోనా ముందుస్థాయికి చేరుకోనున్న ఇళ్ల అమ్మకాలు.!

by srinivas |
కరోనా ముందుస్థాయికి చేరుకోనున్న ఇళ్ల అమ్మకాలు.!
X

న్యూఢిల్లీ: ఇటీవల బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచడం, నిర్మాణాల ధరలు అధికమవుతున్న నేపథ్యంలో భారత నివాస మార్కెట్లో డిమాండ్ ఊపందుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రధాన ఏడు నగరాల్లో నివాసాల అమ్మకాలు 2.62 లక్షల యూనిట్లతో కరోనా ముందుస్థాయికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఆరేళ్ల కాలంలో పెద్ద నోట్ల రద్దు, రెరా, జీఎస్టీ అమలు, కరోనా మహమ్మారి వంటి నాలుగు కీలక పరిణామాలతో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నద్. ఇదే సమయంలో దేశీయ హౌసింగ్ మార్కెట్ నిర్మాణాత్మకమైన మార్పులను ఎదుర్కొంటోంది.

ఈ క్రమంలో ప్రస్తుతం నివాస మార్కెట్ వృద్ధి అవకాశాలను మెండుగా కలిగి ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక వడ్డీ రేట్లను 140 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనివల్ల బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీలను పెంచాయ్. ఇది హౌసింగ్ మార్కెట్లో అమ్మకాలను వేగాన్ని తగ్గించింది. ఇదే సమయంలో అధిక ఇన్‌పుట్ ఖర్చులు, ముఖ్యంగా సిమెంట్, ఉక్కు ధరలు 5 శాతం పెరగడంతో ఇళ్ల ధరలు పెరగడం కొంత ప్రభావాన్ని చూపించిందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై మెట్రో, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూనే వంటి ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2019 నాటి 2.61 లక్షల యూనిట్ల స్థాయిని దాటుతాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. కానీ, 2014 నాటి 3.43 లక్షల యూనిట్ల స్థాయి కంటే తక్కువగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed