- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్ షెల్టరా?? లేక బైక్ షెల్టరా?
దిశ, మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మల్యాల క్రాస్ రోడ్డు వద్ద లక్షలు పోసి నిర్మించిన బస్ షెల్టర్ నిరూపయోగంగా మారింది. నిత్యం అనేకమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే మల్యాల క్రాస్ రోడ్డు మండలంలోని పలు గ్రామాలను కలిపే కేంద్రబిందువుగా ఉంటుంది. జగిత్యాల, కరీంనగర్ నుండి మల్యాల మండలంలోని గ్రామాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఈ స్టాప్ నుండి వెళ్తుంటారు. మల్యాల క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన బస్ షెల్టర్ లో ఎప్పుడు బస్సులు ఆపకపోవడంతో లక్షలు పోసి నిర్మించిన బస్టాండ్ లు కేవలం వాహనాలు నిలిపే పార్కింగ్ కేంద్రాలుగా మారాయి.
దిగువ కొండగట్టులోనూ అదే పరిస్థితి
మండల కేంద్రంలోని దిగువ కొండగట్టులో నిర్మించిన బస్ షెల్టర్ యాచకులకు ఆవాసంగా మారింది. కొండగట్టు పుణ్యక్షేత్రానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు, ఇతర ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులకు సరైన సదుపాయలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు రోడ్డు మీద గుంపులుగా నిలబడి ఉండటం, జంక్షన్ల వద్ద ఎలాంటి పర్యవేక్షణ గాని, స్పీడ్ బ్రేకర్లు గాని ఏర్పాటు చేయకపోవడం వలన ఇతర వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ప్రయాణికులు రోడ్డుపైన వేచి ఉండటం వలన గతంలో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు వెంటనే స్పందించి బస్ షెల్టర్ లలో బస్సులు ఆపేలా చర్యలు తీసుకుంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు.