- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశంలో ఆర్టీసీ బస్సు బోల్తా
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని నేషనల్ హైవే పై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్కాపురం నుండి వెళ్తూ తిప్పాయపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.
సిమెంటు ట్యాంకర్ లారీ ని ఓవర్టేక్ చేసి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు చివరిభాగంలో లారీ తగలడంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు పక్కకి వాలుతున్న సమయంలో అందులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు లారీ కూడా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
సమాచారం తెలుసుకున్న మార్కాపూర్ రూరల్ ఎస్ఐ కోటయ్య తమ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు మరొక బస్సు ఏర్పాటు చేసి వారి పట్టణాలకు పంపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.