- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ పొలిటీషియన్స్‌పై బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకులపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ… టీవీలు చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ప్రతినెలా ఎలక్షన్స్ వస్తాయేమోనన్న భయంతో డిబేట్లలో పాల్గొంటున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయనే విషయాన్ని ఏపీ రాజకీయ నాయకులు, ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాజకీయ నాయకులను చూసి కష్టకాలంలో ఎలా ఉండాలో నేర్చుకోండని బండ్ల గణేశ్ హితవు పలికారు. రాజకీయాలకు ఇది సమయం కాదని… ఇది బతుకు పోరాట సమయమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి, దేవుడి మీద ప్రమాణాలను పక్కన పెట్టి, ప్రజలను కాపాడాలని సూచించారు.
మనమెవ్వరమూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదన్న ఆయన. జీవించిన కాలంలో ఎంత గొప్పగా బతికాం, ఎంత ఆదర్శవంతంగా ఉన్నాం అనేదే ముఖ్యమన్నారు. కేసీఆర్‌నుద్దేశిస్తూ నిజాయతీ మీ యశస్సు, నీతి మీ ఆయుష్షు… జై కేసీఆర్ అని ట్వీట్ చేశారు.
Tags: bandla ganesh, ap, ts, comments, hydrabad