నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్

by Anukaran |
నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్
X

న్యూఢిల్లీ: కాలం కలిసొస్తే నడిసొచ్చే కొడుకు పుడుతాడంటే ఇదేనేమో. గ్రామీణ ప్రాంత యువత అంటే పెద్ద పెద్ద కంపెనీలు కొంత వరకు చిన్న చూపు చూస్తాయి. వారిలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవని వారి వైపు అదోలా చూస్తాయి. వారిని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు అంతగా ఇష్టం చూపవు. అయితే.. ప్రస్తుతం కరోనా వల్ల గ్రామీణ, చిన్న నగరాల యువతకు బంపర్ ఆఫర్ లభించింది. పెద్ద పెద్ద కంపెనీలు వీరిని ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం వీరికి ముందుగా కొద్ది రోజులపాటు ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఆ తర్వాత ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేసేలే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. బిజినెస్‌ ప్రాసెసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ (బీపీఓ) కంపెనీలూ చాలా వరకు కరోనా వల్ల తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీలు నష్టాలే చవిచూస్తున్నాయి. క్లయింట్లు అంతగా లేరంట. పైగా ఉన్న కస్టమర్లు డిస్కౌంట్లు అడుగుతున్నారంట. దీంతో ఆయా కంపెనీలు నష్టాల ఊబీలో నుంచి ఇబ్బందిగా పరిస్థితులు తయారయ్యాయి. ఈ నేపథ్యంలో నష్టాల లోటును తీర్చుకునేందుకు ఆయా కంపెనీలు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

తక్కువ ఖర్చుతో ఉద్యోగులను నియమించుకోవడానికి కొత్త విధానాన్ని ఎంచుకుంటున్నాయి. మెట్రో నగర వాసులకు బదులుగా చిన్న పట్టణాల యువత, గ్రామీణ యువతకు జాబ్స్‌‌‌‌ ఇస్తున్నాయి. వర్క్‌‌‌‌ఫ్రమ్‌ హోం విషయంలో పూర్తిగా ఉబర్‌ మోడల్‌‌‌‌ను పాటిస్తున్నాయి. అనగా.. ‘బ్రింగ్‌ యువర్‌ ఓన్‌ డివైజ్‌’ (బీవైఓడీ) విధానంలో పని చేస్తున్నాయి. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌, రూటర్‌ వంటివి అన్నీ వాళ్లే చేతే కొనిచ్చి ఇంటి నుంచి పనిచేయిస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు చాలా డబ్బు ఆదా అవుతోంది.

ఈ విధానాన్నే తమ కంపెనీ బారాముల్లా, గుర్‌‌‌‌దాస్‌పూర్‌, ఉజ్జయిన్‌ వంటి చిన్న నగరాల, పట్టణాల యువతకు జాబ్స్‌‌‌‌ ఇచ్చిందని ఢిల్లీలోని టెలీ పెర్ఫార్మెన్స్‌‌‌‌కు చెందిన ఆదిత్య అరోరా చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ విధానం వల్ల ఇటు చిన్న నగరాల యువతకు, గ్రామీణ యువతకు ఉపాధి దొరికింది. అటు కంపెనీలకు నష్టాల నుంచి గట్టెక్కుతున్నాయి.

Advertisement

Next Story