- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ ఉద్యోగార్థులకు బంపర్ ఆఫర్..
దిశ, కంటోన్మెంట్ : పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వారికి సువర్ణ అవకాశం. రాష్ట్రంలో త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు వెలువడబోతున్నాయి. పోలీసు కావాలన్నదే మీ లక్ష్యమైతే ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడే సన్నద్ధం కండి. కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఫీజు ఎంత? వసతి ఎలా అనే చింతలు వదిలేయండి. మీలాంటి వారి కోసమే ఉచిత శిక్షణకు ముందుకొచ్చింది. పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్. నిరుపేద గ్రామీణ యువతీ, యువకులకు ఉచితంగా పోలీసు రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు శిక్షణ ఇస్తోంది. రాంకీ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా అందిస్తున్న ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నారు.
19న ఉదయం 10 గంటలకు నిర్వహించే టాలెంట్ టెస్టులో ఉత్తమంగా రాణించిన 300 మంది అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి కల్పిస్తూ అత్యుత్తమ అధ్యాపకుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, డేస్కాలర్ పద్దతుల్లో మొత్తం 900 మంది ఔత్సాహికులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ గద్దె భాస్కర్. డిగ్రీ పూర్తయిన, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఈ అర్హత పరీక్షకు హాజరు కావచ్చన్నారు. టాలెంట్ టెస్టులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెలాఖరు నుంచి శిక్షణ మొదలవుతుంది. 2018లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్వాహకులు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, గద్వాల్, నాగర్ కర్నూల్, షాద్ నగర్, సంగారెడ్డి, రామాయంపేట్, సిరిసిల్ల, కరీంనగర్, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, తొర్రూరు మొత్తం 13 కేంద్రాల్లో టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ టెస్టుకు రిజిస్ట్రేషన్, ఇతరత్రా వివరాల కోసం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఫేస్‌బుక్ పేజీలోని సమాచారాన్ని ఈ క్రింది లింకు https://www.facebook.com/paravasthucreativefoundation ద్వారా చూడండి, సందేహాల నివృత్తి కోసం 7013244247, 6309148246 సంప్రదించవచ్చునని తెలిపారు.