- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు చీకట్లో చంద్రుని వలే.. గేదె నలుపు, దూడ తెలుపు
దిశ, కుబీర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కుబీర్ మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం మండలంలో బర్రెల వెతుకులాట( స్మార్ట్ సెర్చ్) పూర్తి కాకముందే.. శనివారం కుబీర్ మండలంలోని పార్టీకే గ్రామంలో ఓ నల్లటి గేదెకు తెల్లటి దూడ జన్మించింది. సాధారణంగా గేదెలు ఎక్కువగా నలుపు రంగులోనే దర్శనమిస్తుంటాయి. వాటికి జన్మించే సంతానం కూడా చాలా మేరకు నలుపు రంగులోనే ఉంటాయి.
పార్టీకే గ్రామానికి చెందిన షానే రెడ్డి అనే రైతుకు చెందిన గేదెకు తొలిసారి తెల్ల రంగులో ఉన్న దూడ జన్మించింది. మొదట దీనిని చూసిన వారంతా ఆవు దూడను గేదె దగ్గర ఎందుకు కట్టేశారు అనుకున్నారట.. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే అసలు విషయం తెలియడంతో గ్రామస్తులు షాక్ అయ్యారట.. నలుపు రంగు గేదె వద్ద తెల్ల రంగులో పాల వలే మెరిసిపోతున్న దూడ పాలు తాగుతూ కనిపిస్తుండటంతో అర్థరాత్రి నల్లటి ఆకాశంలో చంద్రుడు వలే కనిపిస్తుందని చూసిన వారు మురిసిపోతున్నారు. అయితే, అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని, రానురాను రంగు తగ్గుతూ వస్తుందని కొందరు రైతులు చెబుతున్నారు.