డిపాజిటర్ల సొమ్ముకు భరోసా!

by Harish |
డిపాజిటర్ల సొమ్ముకు భరోసా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో పలు బ్యాంకుల కారణంగా డిపాజిటర్లు తమ నగదును తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇత్తిడికి గురైన బ్యాంకు డిపాజిటర్లు తమ నగౌను తీసుకునేందుకు ఇప్పుడు ఆర్‌బీఐ చర్యల వరకు ఎదురు చూడాల్సిన అవసరంలేదు. బడ్జెట్-2021లో డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారీంటీ కార్పొరేట్ యాక్ట్-1961ని సవరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదన పెట్టారు. ఈ నిర్ణయంతో ఏదైన బ్యాంకు డిపాజిటర్ల బాధ్యతలను నెరవేర్చని పక్షంలో వారి నగదును తీసుకునేందుకు వీలయ్యేలా ఈ సవరణ ఉండనుంది. సదరు బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) పరిశీలనలో ఉన్నప్పటికీ, ఖాతాదారులు రూ. 5 లక్షల డిపాజిట్ బీమాను పొందవచ్చు. అయితే, బ్యాంకు సాధారణ కార్యకలాపాలను మాత్రం ఆపేస్తారు.

అయితే, బ్యాంకు లైసెన్స్ రద్దు అయినప్పుడు కానీ, ద్రవ్య చర్యలను ప్రారంభించినప్పుడు మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, కఠినమైన నిబంధనల వల్ల అధిక ఒత్తిడికి గురైన బ్యాంకులు ఈ జాబితాలోకి రావని చెప్పారు. ఆర్‌బీఐ సదరు బ్యాంకును తాత్కాలికంగా నిషేధం ఉంచినప్పుడు, ఖాతాదారులకు నగదును ఉపసంహరించుకునేందుకు పరిమితిని విధిస్తుంది. అలాంటి సమయంలో కొన్నిసార్లు నగదును తొందరగా తీసుకోవచ్చు, మరి కొన్నిటికీ ఏళ్ల సమయం పట్టొచ్చు. తక్కువ రాబడి ఉన్నా సరే భద్రత కోసం కస్టమర్లు ఎక్కువగా బ్యాంకులనే ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మెరుగైనదే అని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story