బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

by Shyam |   ( Updated:2020-07-04 10:32:25.0  )
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, పటాన్‌చెరు: కడుపు నొప్పి భరించలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం పటాన్‌చెరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకుల్ నగర్ కు చెందిన గుడిసెల బిక్షపతి కూతురు పావని(22) కూకట్‌పల్లిలోని ఎంఎన్‌ఆర్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. గత కొంతకాలంగా పావని తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం కడుపు నొప్పి తీవ్రం కావడంతో భరించలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

Next Story

Most Viewed