- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్షంలో పాటల పాడుతూ పాదయాత్ర.. రోడ్డుపై వారే స్పెషల్ అట్రాక్షన్
దిశ, జవహర్ నగర్: దేశ వ్యాప్తంగా నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నేడు బంద్ పాటించాలని అఖిల పక్షం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కార్పొరేషన్ పరిధిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీలు, పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు బంద్ పాటించాలని కోరారు. అయితే ఉదయం నుండి ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తున్న కారణంగా అఖిల పక్షం కమిటీ ఎక్కడా తన ఉనికిని చాటలేకపోయింది.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా..
దేశ వ్యాప్తంగా వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఒంటరి పోరుకు సిద్ధమై, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుండి బాలాజీ నగర్‌లోని అంబేడ్కర్ విగ్రహం మీదుగా ప్రధాన రహదారిపై బీఎస్పీ జెండాలతో పాటలు పాడుతూ పాదయాత్ర నిర్వహించారు. వర్షంలో బీఎస్పీ నేతల నిరసనలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ప్రధాన రహదారిపై ధర్నా… అరెస్ట్
అఖిల పక్షం నేతల ఆధ్వర్యంలో జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో బంద్ కోసం ప్రధాన రహదారి గుండా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రదర్శనలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం ముందు ప్రధాన రోడ్డులో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అఖిల పక్షం నేతలను అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు శ్రీకాంత్, శంకర్, నర్సింహ, ప్రసాద్, శ్రీనివాస్, అనంత లక్ష్మి తదితరులున్నారు.