- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గమనిక.. ఆ సేవలు బంద్
దిశ, కొత్తగూడ : మొబైల్ మన జీవితాల్లో ఒక భాగమై పోయింది. దాదాపుగా అన్ని పనులకు మొబైల్ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కొత్తగూడెం, గంగారం మండలాల్లో గత రెండు రోజులుగా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో మిగతా నెట్ వర్క్ ల కన్నా బీఎస్ఎన్ ఎల్ వినియోగదారుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా గంగారం మండలంలో కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ మాత్రమే ఉంది. వేరే నెట్ వర్క్ ఏవీ అక్కడ పని చేయవు. ఇక్కడ బీఎస్ఎన్ఎల్ కూడా నామమాత్రంగా పని చేస్తుందని వినియోగదారులు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. సిగ్నల్ పూర్తిగా నిలిపివేసిన రెండు రోజులు గడుస్తున్నా సంస్థ అధికారులు ఇప్పటికీ స్పందించడం లేదు. దీనితో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కలిగిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా బీఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి సిగ్నల్ సమస్య తొలగించాలని ఇరు మండల ప్రజలు కోరుతున్నారు.