- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఒకే ప్యానెల్‌కు పదింటికి పది స్థానాలు దక్కడం విశేషం. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ ఎన్నికల్లో బొమ్మినేని రవీందర్ రెడ్డి అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచి సమీప ప్రత్యర్థి సాదుల దామోదర్‌పై 207 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బొమ్మినేని రవీందర్ రెడ్డికి మొత్తం 631ఓట్లు పోల్ అవగా, సాదుల దామోదర్‌కు 424 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా మొగిళి చంద్రమౌళి తన సమీప ప్రత్యర్థి కట్కూరి సత్యనారాయణపై 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా మడూరి వేదప్రకాష్, సంయుక్త కార్యదర్శిగా సాగర్ల శ్రీనివాస్, కోశాధికారిగా అల్లె సంపత్, కార్యవర్గ సభ్యులుగా కూడా బీఆర్ఆర్ ప్యానల్‌కు చెందిన కైలాస హరినాథ్, గాజుల సుమన్, మేకల రవి, వెల్ది చక్రధర్, సదాటి రాజేశ్వర్ రావులు ఎన్నికయ్యారు.
షాక్‌లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి…
వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దామోదర్ ప్యానెల్‌ను గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీకి చెందని కీలక ప్రజాప్రతినిధి చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వ్యాపారులపై సామ, దాన,భేద, దండోపాయలు ప్రయోగించినా సదరు నేతను లెక్క చేయకుండా గట్టి తీర్పు ఇచ్చినట్లుగా చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల మధ్య చర్చ జరుగుతోంది. పదింటికి పది స్థానాలను బొమ్మినేని రవీందర్‌రెడ్డి ప్యానెల్‌కు దక్కడంతో ఆయన వర్గంలో సంతోషాలు వెల్లి విరుస్తున్నాయి.