- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావ, మరదలు ఆత్మహత్యా యత్నం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో బావ,మరదలు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…గాంధారి మండలం పెద్ద పోతంగల్ గ్రామానికి చెందిన సాయిరాం, కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామానికి చెందిన రమ్యలు బావ మరదళ్లు. ఈ నెల 2న బాన్సువాడ పరిదిలోని బోర్లం గ్రామానికి చెందిన వ్యక్తితో రమ్యకు పెండ్లి నిశ్చయమైంది.
ఈ నేపథ్యంలో బావ, మరదలు శనివారం విషం సేవించి ఆర్టీసీ బస్సు ఎక్కారు. కాగా సదాశివనగర్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ధ బస్సులో వారిని బంధువులు గుర్తించారు. బావతో కాకుండా వేరే వ్యక్తితో పెండ్లి నిశ్చయించినందుకు వారు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చెస్తున్నారు. చికిత్స నిమిత్తం బావ,మరదళ్లను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సాయిరాం,రమ్యలను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.