- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థం అయిన నెల రోజులకే..
దిశ, నర్సంపేట: టిప్పర్ లారీ ఢీ కొని అన్నా చెల్లెలు మృతి చెందిన సంఘటన నర్సంపేట బిట్స్ కాలేజీ వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. దబీరుపేట గ్రామానికి చెందిన మొగుళ్ల రమేష్, విజయలు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీనితో వీరి కుమారుడు మొగుళ్ల రాకేశ్ ఇంటర్మీడియట్ తో చదువు ఆపి పనిచేస్తూ చెల్లిని డిగ్రీ చదివించాడు. చెల్లెలి పెళ్లి నిశ్చితార్థం కూడా చేశాడు. గత నెలలో రాకేశ్ కూడ వరంగల్ కి చెందిన యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రాకేశ్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా తన చెల్లెలు ప్రసన్న ని తీసుకొని వరంగల్ ఏ.పి 10 ఏటి 8008 సి.బి.జెడ్ బైక్ పై వరంగల్ వైపు వెళుతుండగా, వరంగల్ నర్సంపేట వైపు వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటనతో ఖానాపూర్ మండలం దబీరుపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.